మంత్రాలతో నీ కొడుకు ఆరోగ్యం నయం చేస్తానంటూ..

27 Aug, 2021 09:39 IST|Sakshi

సాక్షి,నేరేడ్‌మెట్‌( హైదరాబాద్‌): మంత్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిని నేరేడ్‌మెట్‌ పోలీసులు గురువారంఅరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మస్వామి సమాచారం మేరకు... లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల కొడుకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయంలో నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆర్‌.కె.పురానికి చెందిన రాకేష్‌ను ఆమె సంప్రదించింది.

దీంతో మంత్రాలు, పూజల పేరుతో కొడుకు ఆరోగ్యం నయం చేయడంతోపాటు ఇంట్లోని ఇతర సమస్యలనూ బాగు చేస్తానని నిందితుడు ఆమెను నమ్మించాడు. ఇందుకు బాధితురాలు రూ. 2.60 లక్షలతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. తరువాత పూజలు ఎప్పుడు చేస్తావని  బాధితురాలు నిందితుడిని అడుగగా రేపుమాపు అంటూ కాలాయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి తన డబ్బు, బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి నిందితుడిని గట్టిగా అడిగింది.

ఈ నెల 10న నిందితుడు బా ధితురాలని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మంత్రాలు, పూజల పేరుతో నిందితుడు తనను మోసం చేశాడని బాధితురాలు గుర్తించింది. పలువురు మహిళలు కూడా బెదిరించారని బాధితురాలు నేరేడ్‌మెట్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశామని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.  

చదవండి: chicken: భర్త చికెన్‌ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య

>
మరిన్ని వార్తలు