హైదరాబాద్‌: అప్జల్‌గంజ్‌ పరిదిలోని గౌలిగూడలో కెమికల్‌ పేలుడు

12 Jun, 2022 13:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ బ్లాస్ట్‌ జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్‌ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తోంది. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటర్‌తో కెమికల్‌ రియాక్ట్‌ అవ్వడం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. కెమికల్ బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్‌గా (తండ్రి)గా గుర్తించారు. 
 

మరిన్ని వార్తలు