ఓరి భగవంతుడా! కళ్ల ముందే రూ.80 లక్షలు.. కానీ, తీద్దామంటే..!

26 Apr, 2022 18:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్నేహితుల మాట విని క్రిప్టో కరెన్సీలో డబ్బు ఇన్వెస్ట్‌ చేసిన వ్యాపారస్తుడు లక్షల రూపాయిలు మోసపోయాడు. కంటికి లక్షలు కనిపించినా తీసేందుకు ఒక్క రూపాయి రాకపోవడంతో బాధితుడు సోమవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీ నగర్‌కాలనీకి చెందిన మహేష్‌ వృతిరీత్యా వ్యాపారస్తుడు. తన స్నేహితులు కొందరు ప్రాన్‌డాట్‌ ఏసీ డాట్‌ వెబ్‌సైట్‌లో క్రిప్టో కరెన్సీ చేస్తే లాభాలు వస్తాయని సూచించారు.
చదవండి👉 ‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌.. అమ్మా, నాన్నా క్షమించండి..’

దీంతో వారిచ్చిన టెలిగ్రామ్‌ లింకులో జాయిన్‌ అయ్యి చాట్‌ చేశాడు. తొలుత రూ.30వేలు పెట్టగా రూ.50వేలు వచ్చాయి. ఆశతో పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.80 లక్షలు పెట్టాడు. రూ.80 లక్షలకు కోటికి పైగా లాభం కంటికి కనిపిస్తుందే కానీ తీసేందుకు ఒక్క రూపాయి రావడం లేదు. ఫేక్‌ అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 
చదవండి👉 వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

మరిన్ని వార్తలు