బంజారాహిల్స్‌: భార్యను కత్తితో పొడిచి తానూ పొడుచుకున్నాడు 

25 Nov, 2021 08:53 IST|Sakshi

ఇద్దరినీ ఆస్పత్రికి తరలించిన బంధువులు 

సాక్షి,బంజారాహిల్స్‌: ఓ వ్యక్తి భార్యను కత్తితో పొడవడమే కాకుండా తాను కూడా పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.  బంజారాహిల్స్‌  పోలీసులు తెలిపిన మేరకు.. జహీరాబాద్‌కు చెందిన సత్తమ్మ అలియాస్‌ పుణ్యమ్మ(50), ఆమె భర్త మానయ్య మధ్య గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు తీవ్రం కావడంతో రెండు నెలల క్రితం సత్తమ్మ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని మిథిలానగర్‌లో నివసించే సోదరుడి ఇంటికి వచ్చింది.
చదవండి: ఇదో గమ్మత్తు కథ.. సీజ్‌ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా!

తన భార్యను తీసుకుపోయేందుకు మానయ్య కూడా రెండు రోజుల క్రితం మరదలు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో భార్య కూడా అక్కడ ఉండటంతో కోపం పట్టలేక ఆమె మంగళసూత్రాన్ని తెంపేసి అక్కడే ఉన్న కత్తితో మూడు చోట్ల పొడిచాడు. ఆమెను కాపాడేందుకు మరదలు కళావతితో పాటు చుట్టుపక్కల వారు ప్రయత్నిస్తుండగానే అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. తీవ్ర గాయాల మధ్య ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు 

మరిన్ని వార్తలు