మెడికల్‌ షాపునకు వెళ్లి తిరిగి వచ్చేసరికి..

28 Aug, 2021 08:54 IST|Sakshi

సాక్షి, అమీర్‌పేట( హైదరాబాద్‌): ఓ కార్పెంటర్‌ భార్య ఆత్మహత్య చేసున్న సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాలిలా.. ఖమ్మం జిల్లా డోర్నకల్‌కు చెందిన బాలాజీ కుటుంబం అమీర్‌పేట డివిజన్‌ బాపూనగర్‌లో నివాసముంటోంది. భార్య అక్క మీరాబాయి (38)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం.కాగా గురువారం రాత్రి చిన్న కూతురుకు జ్వరం రావడంతో మందులు తెచ్చేందుకు బాలాజీ మెడికల్‌ షాపునకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి పిల్లలు ఏడుస్తూ కనిపించారు.

బెడ్‌రూమ్‌ తలుపులు తట్టగా  మీరాబాయి ఎంత సేపటికి తలుపులు తీయకపోవడంతో తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లి చూడగా మీరాబాయి ఉరేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై శంకర్‌ తెలిపారు.

చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌

మరిన్ని వార్తలు