ఒంటరి మహిళలే టార్గెట్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి

1 Oct, 2021 08:17 IST|Sakshi
కిరణ్‌

మోసగాడు చిక్కాడు 

మ్యాట్రిమోని మోసగాడు కిరణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు

తిరుపతిలో అదుపులోకి..

సాక్షి, హైదరాబాద్‌: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకొని పారిపోతున్న మోసగాడు ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి(29) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్‌ పోలీసులు నిందితుడు తిరుపతిలో తలదాచుకున్నాడని తెలుసుకొని అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

కిరణ్‌తో పాటు ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా? ఇప్పటివరకు ఎంత మంది మహిళలను మోసం చేశాడు? ఎంత డబ్బులు కాజేశాడు వంటి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. నలుగురు పోలీసు సభ్యుల బృందం ఇన్వెస్టిగేషన్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.  
చదవండి: మలక్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి..  

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’.. 
వివిధ మ్యాట్రిమోని సైట్లలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వితంతువు, విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్‌ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులతో ఉడాయించడం కిరణ్‌ ప్రత్యేకత. ఇదే విధంగా కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను మోసం చేసి వారి నుంచి నగదు, డబ్బు తీసుకొని పారిపోయి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. ఈ మోసగాడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆగస్టు 22న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
చదవండి: భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి

పోలీసుల పెద్దగా పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’ని సంప్రదించింది. దీంతో సెప్టెంబర్‌ 9న ‘ఒంటరి మహిళలే టార్గెట్‌’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అయినా పోలీసుల విచారణ ముందుకు సాగకపోవడంతో అవమానం, ఒత్తిడి తట్టుకోలేక ఆ అభాగ్యరాలు సెప్టెంబర్‌ 19(ఆదివారం) ఆత్మహత్య చేసుకుంది. దీంతో ‘పోలీసు నిర్లక్ష్యమే చంపేసింది’ శీర్షికన సెపె్టంబర్‌ 23న ‘సాక్షి’ మరో కథనం ప్రచురించింది. దీంతో పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించి నిందితుడిని పట్టుకుంది.

మరిన్ని వార్తలు