మ్యాట్రీమోనిలో పరిచయం.. మూడు వారాల చాటింగ్.. ఆ తరువాత..

20 Aug, 2021 08:41 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): మ్యాట్రీమోనిలో ఫేక్‌ ఐడీ, ఫేక్‌ ఫోటో పెట్టి ఓ యువతిని మోసం చేసిన నిందిదితునిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన యువతి (28) ప్రైవేట్‌ ఉద్యోగి. ఓ మ్యాట్రీమెని వెబ్‌సైట్‌లో ఆంథోనీ సి వర్మ అనే యువకుడి ప్రొఫైల్‌ చూసి నచ్చింది. అతను ప్రొఫైల్‌లో యూకేలో మెడికల్‌ కోర్సు చదువుతున్నట్లు ఉండటంతో అతన్ని సంప్రదించింది. ఇద్దరూ సుమారు మూడు వారాల పాటు వాట్సప్‌లో సందేశాలు పంపడం, ఫోన్‌లో మాట్లాడడం చేశారు. సెప్టెంబర్‌లో తాను ఇండియాకు వస్తున్నానని, రాగానే నగరానికి వచ్చి నిన్ను కలుస్తానని నమ్మబలికాడు. సదరు యువతిని నీ అడ్రస్‌ చెప్పు యూకే నుండి ఖరీదైన పార్సల్స్, 
25 వేల పౌండ్స్‌ పంపుతాను అని చెప్పడంతో యువతి అడ్రస్‌ చెప్పింది. కొన్ని రోజులకు యువతికి ఢిల్లీ కస్టమ్స్‌ కార్యాలయం నుండి మెయిల్‌ చేస్తున్నామని, మీకు పార్సల్స్‌ వచ్చాయి పార్సల్స్‌ తీసుకోవాలంటే కొంతమేర నగదు చెల్లించాలని కోరడంతో యువతి పలు మార్లు తనఖాతా నుండి మొత్తం 93,250 రూపాయలు బదిలీ చేసింది.నగదు ఆ తరువాత యువకుడి నుంచి స్పందన లేకపోవడం, మ్యాట్రిమోనిలో కూడా ఆంథోనీ ప్రొఫైల్, ఐడీ అంతా తప్పు అని నిర్ధారించుకుని మొసపోయినట్లు గ్రహించి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు