Hyderabad: పదో తరగతి బాలికపై జిమ్‌ ట్రైనర్‌ అత్యాచారం 

4 Sep, 2022 11:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన జిమ్‌ ట్రైనర్‌పై జీడిమెట్ల పోలీసులు అత్యాచారం, ఫోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎం.పవన్‌ వివరాల ప్రకారం.. గాజులరామారం డివిజన్‌ నెహ్రూనగర్‌కు చెందిన విశ్వక్‌(23) జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. కాగా అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక(14)తో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో విశ్వక్‌ సదరు బాలికతో ఉన్న చనువుతో బాలికను గత నెల 29వ తేదీన ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు.

బాలిక రాత్రైనా ఇంటికి రాకపోవడంతో బాలిక కనబడటం లేదని బాలిక తండ్రి అదేరోజు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కాగా విశ్వక్‌ శుక్రవారం బాలికను ఇంటి వద్ద వదిలివెళ్లిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో విశ్వక్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు.   
చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని..

మరిన్ని వార్తలు