భర్త పని కోసం బయటకు.. భార్య బిడ్డతో కలిసి అనంతలోకాలకు

24 Jul, 2021 07:56 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: ఇంట్లో చీరతో ఉరివేసుకుని తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మేడ్చల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపక్, శాలిని(33) దంపతులు 4 నెలల క్రితం అత్వెల్లికి వచ్చి భూపతిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో మొదటి అంతస్థులో అద్దెకుదిగారు. దిలీప్‌ దూరప్రాంతాల్లో కూలీపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు మూడు రోజులకోసారి ఇంటికి వస్తూ భార్య శాలిని, కుమారుడు నయిన్‌(11)లను చూసుకుంటున్నాడు. దిలీప్‌కు పని దొరకడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్‌కు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శాలిని తన కుమారుడితో కలిసి పై కప్పుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మొదట కుమారుడికి ఉరివేసి తాను ఉరివేసుకుని శాలిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో కనిపిస్తుంది. ఆత్మహత్యకు కారణాలు మాత్రం తెలియడం లేదు. 
రెండు రోజుల క్రితం.. 
ఇంటి పై అంతస్థు నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని భూపతిరెడ్డి పైకి వెళ్లి చూడటంతో శాలిని గదికి లోపలినుండి గడియ వేసి ఉంటడంతో తలుపులు తట్టినా ఎంతకు తీయడంతో అనుమానంతో తలుపులు బద్దలు గొట్టి లోపలికి వెళ్లి చూడంతో తల్లి కుమారుడు పై కప్పుకు వేలాడుతుండటంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురికి తరలించారు. తల్లికూతురు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఎస్‌ అప్పారావు తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామని వారు వచ్చాక వివరాలు తెలిసే అవకాశముందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు