ఏపీ పోలీసుల అదుపులో నగరవాసి

12 Aug, 2020 08:17 IST|Sakshi
జీడిమెట్ల ఫైప్‌లైన్‌ రోడ్డులోని పర్‌ఫెక్ట్‌ సాల్వెంట్‌ దుకాణం

శానిటైజర్‌ తాగి 16 మంది చనిపోయిన ఘటనలో... 

జీడిమెట్ల: ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన కేసులో మూలాలు హైదరాబాద్‌ శివారులో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు జీడిమెట్లకు చెందిన సాలె శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్‌ శానిటైజర్‌ను ఎలా తయారు చేయాలి అని యూట్యూబ్‌లో చూశాడు. అనంతరం ముడి సరుకులను జీడిమెట్ల పైప్‌లైన్‌ రోడ్డులో ఉన్న హమీద్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పర్‌ఫెక్ట్‌ సాల్వెంట్‌ షాపులో నిషేధిత రసాయనం మిథైల్‌ క్లోరై‡డ్‌తో పాటు తదితర రసాయనాలను కొనుగోలు చేశాడు.

అనంతరం లాభసాటిగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నకిలీ శానిటైజర్లు సరఫరా చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామంలో 16 మంది తాగిన శానిటైజర్‌ ఇక్కడ తయారయ్యిదేనని  తెలుసుకుని ఏపీ పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తేల్చేందుకు సన్నద్ధమయ్యారు.  కాగా శ్రీనివాస్‌ ఇంటి వద్దనే శానిటైజర్‌ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో హమీద్‌ పాత్ర తేల్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు