ప్రేమించిన యువతితో పెళ్లి వద్దన్నారని..

5 May, 2021 08:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ (సైదాబాద్‌): ప్రేమించిన యువతితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సైదాబాద్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌లాల్‌ నాయక్‌ తెలిపిన వివరాలు.. మాధవనగర్‌లో నివసించే జి.నాగేశ్వర్‌ కుమారుడు ప్రజ్వల్‌ (28) ఎంబీఏ చదువుతున్నాడు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయమని ఇంట్లో తల్లిదండ్రులను కోరాడు.

అయితే తండ్రి ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని చెప్పడంతో అలిగిన ప్రజ్వల్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుని గురించి బంధు మిత్రుల దగ్గర విచారించినా ఫలితం లేకపోవటంతో తండ్రి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజ్వల్‌ గతంలోనూ ఇలా ఇంటి నుంచి అలిగివెళ్లి తిరిగివచ్చాడని ఫిర్యాదులు పేర్కొన్నాడు. సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

( చదవండి: పెళ్లి చేసుకుంటావా.. లేదా అంటూ యువతిని నడిరోడ్డుపై )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు