జూబ్లీహిల్స్‌ కేసులో నిందితుడి అరెస్ట్‌

20 Mar, 2022 03:14 IST|Sakshi
అఫ్నాన్‌ 

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు నెలల పసికందు మరణానికి కారణమైన యువకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండురోజులుగా పలు మలుపులు తీసుకున్న కేసును జూబ్లీహిల్స్‌ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల వాంగ్మూలం ఆధారంగా కొలిక్కి తీసుకొచ్చారు. గురువారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ స్నేహితుడు సయ్యద్‌ అఫ్నాన్‌(19) కారు నడిపిస్తున్నట్లు తేలడం తో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

మెహిదీపట్నంకు చెందిన సయ్యద్‌ అఫ్నాన్‌  బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి మహ్మద్‌ మాజ్, ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహిల్‌ స్నే హితులు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడితోపాటు మిగతా ఇద్దరూ అక్కడి నుం చి పారిపోవడంతో కారు నడిపిందెవరు అనే విషయంపై అనేక సందేహాలు తలెత్తాయి.

ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు అందుబాటులో లేకపోవడం తో దారి పొడవునా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దీంతోపాటు సంఘట న జరిగిన వెంటనే కాస్త దూరంలో ఉన్న ఓ కారు డెకా ర్‌ స్టోర్‌లో ఉన్న సీసీ ఫుటేజీలో అస్పష్టంగా ముగ్గురు యువకులు పారిపోతున్న దృశ్యా లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కొంత మంది యువకులు కారు నడిపిస్తున్న అఫ్నాన్‌ను కొట్టిన ట్లు తెలిసింది.

శుక్రవారంరాత్రి పోలీసులు అఫ్నాన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించ గా కారు తానే నడిపినట్లు ఒప్పుకున్నట్లు తె లిసింది. అతడిని సంఘటనా స్థలానికి తీసు కెళ్లి సాక్షులకు చూపించగా అతడే కారు నడిపినట్లు నిర్ధారణ అయింది. దీంతోపాటు సైబర్‌ టవర్స్‌ సమీపంలో కారు ఎక్కేటప్పు డు వచ్చిన సీసీ ఫుటేజీలు కూడా పరిశీలించి నిందితుడు అఫ్నాన్‌ అని గుర్తించారు.

మరిన్ని వార్తలు