ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి..

28 Nov, 2021 08:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,అల్వాల్‌(హైదరాబాద్‌): దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. శనివారం సరూర్‌నగర్‌ ట్యాంక్‌ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోని తీసుకొని ప్రశ్నించగా పాత నేరస్తుడు గఫార్‌ఖాన్‌గా తెలిసింది. చదవండి: అమ్మకు జరిగిన మోసం.. మరెవరికి జరగకూడదని.. )

గతంలో దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన గఫార్‌ఖాన్‌ అలియాస్‌ జిగర్‌ (28), చార్మినార్, యాఖూత్‌పురాలో ఉదయం పూలు అమ్ముతూ రాత్రి సమయంలో వేషం మార్చి విల్లాలు, డూప్లేక్స్‌ ఖరీదైన ఇళ్లలో బంగారు నగలు, నగదు, మొబైల్‌ ఫోన్లను దొంగిలించేవాడు. సరూర్‌నగర్, బాలాపూర్, చైతన్యపురి, హయాత్‌నగర్, పహడీషరీఫ్, వనస్థలిపురం, రాజీవ్‌గాంధీ విమానాశ్రయం పోలీస్‌ స్టేషన్‌ పరిధి, శంషాబాద్,  మైలార్‌దేవులపల్లి, రాజేందర్‌నగర్, మొయినాబాద్, ప్రాంతాల్లో మొత్తం 27 కేసులు నమోదయ్యాయి. గఫార్‌ఖాన్‌తో పాటు అతని వద్ద బంగారం నగలు కొన్న ఖాజాపాషాను అరెస్టు చేసి వీరి నుంచి కిలో 805 గ్రాముల బంగారం నగలు, రూ.1.90 లక్షలు, విలువైన ఓ ద్విచక్ర వాహనం, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించిన పోలీస్‌ అధికారులను సీపీ అభినందించారు.

చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్‌ స్తంభానికి కట్టేసి..

మరిన్ని వార్తలు