విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి..

27 Nov, 2021 09:23 IST|Sakshi
అండ్రూ హసన్‌  

సాక్షి, అల్వాల్‌: మానవ అక్రమ రవాణకు పాల్పడుతూ వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నిందితుడిపై రాచకొండ పోలీసులు పీడి చట్టాన్ని నమోదు చేసి జైలుకు పంపించారు. రాచకొండ కమిషనరేట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... టాంజానియా దేశానికి చెందిన కబాంగిలా వారెన్‌ అలియాస్‌ అండ్రూ హసన్‌ నేరేడ్‌మెట్‌లోని జీకే కాలనీలో నివాసముంటున్నాడు.
చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: బీజేపీలో ఈటల ‘స్వతంత్రం’.. ఆదిలాబాద్‌లో షాక్‌!

ఇతను విదేశాల నుండి విద్య కోసం విద్యార్థినులను వీసాపై ఇండియాకు రప్పిస్తున్నాడు. వారికి ఆశ్రయం కల్పించి ఆదాయం సమకూర్చుతానని నమ్మించి వ్యభిచారంలోకి దింపుతున్నాడు. స్థానికంగా తన పరిచయాల ద్వారా మహిళల వద్ద విటులను పంపిస్తున్నాడు. రాచకొండ  యాంటీ  హ్యూమన్‌  ట్రాఫికింగ్‌ టీమ్‌ నేరేడ్‌మెట్‌ పోలీసులతో కలిసి జూన్‌ 28న నిందితుడు కబాంగిల వారెన్‌ను అరెస్టు చేశాడు. ఇతనిపై పీడియాక్ట్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
(చదవండి: పేదరికం తక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ)

మరిన్ని వార్తలు