హైదరాబాద్‌ పోలీసులకు చిక్కిన దోపిడీ ముఠా

23 Jan, 2021 18:56 IST|Sakshi

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. శంషాబాద్ తొండపల్లి వద్ద అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ టౌన్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన ఈ గ్యాంగ్ నుంచి 25 కేజీల బంగారం, 7 తుపాకులు, బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించగా, సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చదవండి: జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ

సీపీ సజ్జనార్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.‘‘తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్నాం. నిందితుల చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ బృందాలు సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అక్టోబర్‌లో లూథియానా, పంజాబ్ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీ చేశారు. అప్పటి నుంచి నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. తొండపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిందితులను అరెస్ట్ చేశాం. వారిని విచారించగా మరో కంటైనర్‌లో గోల్డ్, వెపన్స్ తరలిస్తున్నట్లు తెలిసింది. మేడ్చల్ వద్ద కంటైనర్‌ను పట్టుకున్నాం. నిందితులు మధ్యప్రదేశ్, జార్ఖండ్‌, యూపీలకు చెందినవారని’’ సీపీ తెలిపారు.  చదవండి: ఆ ఇద్దరు సైకోలకు ఉరిశిక్షల వెనుక..

తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారు..
దోపిడీ ముఠాను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారని కృష్ణగిరి జిల్లా(తమిళనాడు) ఎస్పీ బండి గంగాధర్ అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దాటుకుని తెలంగాణకు వచ్చారని.. ఈ గ్యాంగ్ చాలా ప్రమాదకరమైనదన్నారు. ఆయుధాలతో ఎదురు కాల్పులు జరిపే ప్రమాదం ఉందని, గతంలో లూథియానాలో ఈ గ్యాంగ్ చోరీ విఫలయత్నం అయినపుడు 32 రౌండ్లు కాల్పులు జరిపారని.. ఈ కాల్పులో ఒక వ్యక్తి కూడా మరణించాడని ఆయన వివరించారు.


 

మరిన్ని వార్తలు