గాజుల కార్మాగారంపై పోలీసులు దాడులు

5 Oct, 2020 16:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. గయా, బీహార్‌కి చెందిన పిల్లలతో గాజుల తయారీలో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. బీహార్ నుండి అక్రమంగా పిల్లలను తరలించారని, వారికి కనీసం సరైన భోజనం సదుపాయం కూడా కల్పించడంలేదని, అర్ధరాత్రి వరకు కూడా  వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నలుగురు ఆర్గనైజర్లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మెడికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం 20 మంది చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిస్తామని సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు

గంజాయి ముఠా అరెస్ట్‌..
గంజాయి సరఫరా చేస్తున్న హర్యానాకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. ఒక్కొక్కటి 5.5 కేజీల ప్యాకెట్లగా కంటైనర్‌లో సరఫరా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. మొత్తం 1010 కేజీల 194 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక కంటైనర్, నాలుగు వేలు నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు