హైదరాబాద్‌: ఇంట్లోనే వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్‌..

29 May, 2022 13:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట సర్వోదయనగర్‌ కాలనీకి చెందిన నిర్వాహకురాలు వాసిరెడ్డి సుధారాణి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకురాలు సుధారాణి, దిల్‌సుఖ్‌నగర్‌ కృష్ణానగర్‌కాలనీకి చెందిన విటుడు గట్ల రాజు (37)తో పాటు ఓ యువతిని అరెస్ట్‌ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సుధారాణి గతంలోనూ ఇదే కేసులో పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు.  
కోర్టు భవనం  

మరిన్ని వార్తలు