రఘునందన్, రాజాసింగ్‌పై కేసులు

8 Jun, 2022 02:18 IST|Sakshi

‘కారులో బాలిక’వీడియోల విడుదలతో రఘునందన్‌పై

 అజ్మీర్‌ దర్గా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై ఫిర్యాదులు

రఘునందన్‌రావు ఇల్లు ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, రాజాసింగ్‌ లోథా లపై హైదరాబాద్‌లో కేసులు నమోద య్యాయి. జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచారానికి సంబంధించి ‘కారులో బాలిక’వీడియోలు విడుదల చేశారనే ఆరో పణలకు సంబం ధించి రఘునంద్‌ రావుపై అబిడ్స్‌ పోలీసులు, విద్వేషాలు రెచ్చ గొట్టేలా అజ్మీర్‌ దర్గా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్‌పై కంచన్‌ బాగ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇటీవల బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రఘునందన్‌రావు జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై ఆరోపణలు చేశారు. అదే సందర్భంలో బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. అయితే ఎమ్మెల్యే ఇలా చేయడం చట్ట ప్రకారం నేరమని, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది కరమ్‌ కోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబం ధించి రఘునందన్‌రావుకు నోటీసులు జారీ చేయనున్నారు. 

రఘునందన్‌ ఇల్లు ముట్టడికి యత్నం
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బాధిత బాలిక వీడియోలు, ఫొటోలను బయటపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు మంగళవారం ఆయన ఇంటి ముట్టడికి విఫలయత్నం చేశారు. నార్సింగి పోలీసుస్టేష¯పరిధిలోని ఔటర్‌రింగ్‌ రింగ్‌ రోడ్డు పక్కన ఎమ్మెల్యే నివసించే గేటెడ్‌ కమ్యూనిటీ వద్దకు మంగళవారం పదుల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని గేటు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కొద్ది సేపు అక్కడే కూర్చున్న నిరసనకారులు రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినవారిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేష¯న్‌కు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచి అనంతరం విడిచిపెట్టారు. 

రాజాసింగ్‌పై...: రాజస్తాన్‌లోని అజ్మీర్‌ దర్గాపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఓ వర్గం మనోభావాలను దెబ్బతీశారంటూ కంచన్‌ బాగ్‌కు చెందిన వ్యాపారవేత్త సయ్యద్‌ మహమూద్‌ అలీ సోమవారంరాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధా రంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజాసింగ్‌పై చట్టప రంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సూఫీ ఆర్గనైజేషన్‌కు చెందిన ముతై్తదా మజ్లీస్‌–ఇ–మషై ఆధ్వర్యంలోని మతపెద్దలు సోమవారంరాత్రి దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్యను కలసి వినతిపత్రం అందజేశారు. ఆయన తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటికి సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి చేతులు దులు పుకొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవా లని వారు కోరారు. కిషన్‌బాగ్‌ కార్పొరేటర్‌ హుస్సేనీ పాషా సైతం ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలపై బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు