Drugs Case: మరో 50 మంది ఐటీ ఉద్యోగులకు నోటీసులు?

7 Apr, 2022 12:28 IST|Sakshi

హైదరాబాద్‌:  డ్రగ్స్‌ కేసులు వరుసగా వెలుగుచూడటం భాగ్యనగరాన్ని కలవరపరుస్తోంది.  ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో డ్రగ్స్‌ బారిన పడుతున్న నేపథ్యంలో దీనిపై సిటీ పోలీసులు దృష్టి సారించారు. బుధవారం ఓ కేసుకు సంబంధించి పట్టుబడిన వారిలో  డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై ఆయా కంపెనీలు వేటు వేశాయి. పోలీసులు నోటీసులు ఇవ్వకముందే 13 మందిని సదరు ఐటీ కంపెనీలు తొలగించడం ఇక్కడ గమనార్హం. 

దీనిలో భాగంగా మరో 50 మంది ఐటీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసే ఉద్దేశంలో నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ పెడ్లర్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల చిట్టా లభించగా, అందులో 50 మందికి ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు పెడ్లర్లు డ్రగ్స్, గంజాయి అమ్మినట్లు పోలీసులు తేల్చారు. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రేమ్‌కుమార్, టోనీ, లక్ష్మీపతుల వద్ద నుంచి సదరు ఐటీ ఉద్యోగులు డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేయడంతో వారికి నోటీసులు ఇవ్వడానికి సైబరాబాద్‌ పోలీసులు సిద్ధమయ్యారు. 

మరిన్ని వార్తలు