ఈసారి డ్రగ్స్‌ పంజాబ్‌ నుంచి..

2 Apr, 2022 03:48 IST|Sakshi

రూ. 15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

అల్వాల్‌: పంజాబ్‌ నుంచి రాష్ట్రానికి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ శుక్రవారం వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన జగ్తార్‌సింగ్‌ (58) లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 12 ఏళ్ల క్రితం  వలసొచ్చి మేడ్చల్‌ కండ్లకోయ టోల్‌ప్లాజా సమీపంలో పం జాబీ ధాబా నిర్వహిస్తున్నాడు.

రంజిత్‌సింగ్‌ అనే లారీ డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయంతో పంజాబ్‌ నుంచి  డ్రగ్‌ను తెప్పించి ధాబాకు వచ్చేవారికి చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయించేవాడు. మార్చి 31న రాత్రి 10 గంటలకు శామీర్‌పేట్‌ రోడ్డు వద్ద ఓ అనుమానితకారును ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీ చేయగా జగ్తార్‌సింగ్, అతని అనుచరుడు జైమాల్‌సింగ్‌ 900 గ్రాముల మాదకద్రవ్యం ప్యాకెట్లతో పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్టు చేసి, మాదక ద్రవ్యం ప్యాకెట్లతోపాటు కారు, 3 సెల్‌ఫోన్లు చేసుకున్నారు. వాటి విలువ  రూ. 15 లక్షలు. రంజిత్‌సింగ్‌ పరారీలో ఉన్నాడు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు 

మరిన్ని వార్తలు