Hyderabad: బిల్డింగ్‌ నుంచి దూకి టెన్త్‌ స్టూడెంట్‌ బలవన్మరణం

26 Sep, 2023 11:55 IST|Sakshi

సాక్షి, క్రైమ్‌: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన ఓ విద్యార్థి.. చదువును నిర్లక్ష్యం చేశాడు. అది పోను పోను అతనిని ఆందోళనకు గురి చేసింది.  చివరకు ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

రేయాన్ష్ రెడ్డి(14) ఖాజాగూడ ఓక్రిడ్జ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.  మై హోమ్ బూజాలో అతని కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమంలో.. జే బ్లాక్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రేయాన్ష్ రెడ్డి. 

అక్కడికక్కడే రేయాన్ష్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిస కావడంతో పాటు చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు