మూడు నెలలుగా వెంకట్‌పై నిఘా.. మాదాపూర్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక విషయాలు వెల్లడి

31 Aug, 2023 09:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం సృష్టించాయి. మాదాపూర్‌ విఠల్‌రావు నగర్‌లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పలు చిత్రాలకు ఫైనాన్షియర్‌ వ్యవహరించిన వెంకట్‌ ఆధ్వర్యంలో ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో వెంకట్‌తో పాటు పలువురిని అరెస్ట్‌ చేశారు. అలాగే.. నార్కోటిక్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

సినీ నిర్మాత, ఫైనాన్షియర్‌ వెంకట్‌తో పాటు పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్‌ సూర్య చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించాడు వెంకట్‌. వెంకట్‌తో పాటు పట్టుబడిన బాలాజీ, కె.వెంకటేశ్ర్‌రెడ్డి, డి.మురళి, మధుబాల, మేహక్‌ల నుంచి కోకైన్‌, ఎల్‌ఎస్‌డీ, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన యువతులు సైతం ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కీలక విషయాలు..
ఇక వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతుండగా.. విచారణ వేగవంతం చేశారు అధికారులు.  ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నిఘా పెట్టింటి నార్కోటిక్ బ్యూరో. ఈ క్రమంలోనే..  వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణను నిర్ధారించుకున్నారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి వెంకట్‌ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో నిందితుడు బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు.

ఇక.. వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. వెంకట్ వాట్సాప్‌లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వెంకట్‌ ఫ్లాట్‌లో ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది.


చదవండి: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్‌

మరిన్ని వార్తలు