హైదరాబాద్‌ టెకీ పాడుపని.. ఇన్‌స్టాలో యువతులకు వీడియో కాల్‌ చేసి..

8 Jun, 2022 08:50 IST|Sakshi
నిందితుడు ప్రశాంత్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళను వేధింపులకు గురి చేసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రాచకొండ సైబర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ జే నరేందర్‌ గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన మూడెత్తుల ప్రశాంత్‌ చెంగిచెర్లలో ఉంటూ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. bhavii_098  ఐడీతో సోషల్‌ మీడియాలో మహిళల ప్రొఫైల్స్‌ను అన్వేషిస్తాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన బాధితురాలి ప్రొఫైల్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు.

బాధితురాలు యాక్సెప్ట్‌ చేయగా.. గతంలో ఆమె సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ల నుంచి ఆమె వాట్సాప్‌ నంబర్‌ సేకరించాడు. దాని ద్వారా తన చిన్ననాటి స్నేహితుడి లాగా చాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఓ రోజు ప్రశాంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాధితురాలికి వీడియో కాల్‌ చేశాడు. ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే తన మొహం కనిపించకుండా ప్రైవేట్‌ పార్ట్‌లను మాత్రమే చూపిస్తూ, దాన్ని రికార్డ్‌ చేసి స్క్రీన్‌ షాట్స్‌ తీశాడు. ఆపై బాధితురాలి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేసి, బాధితురాలి ఫొటో, పేరుతో నకిలీ అకౌంట్‌ తెరిచాడు. దీని ద్వారా స్నేహితులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపాడు.

యాక్సెప్ట్‌ చేసినవారికి అప్పటికే రికార్డ్‌ చేసిన అసభ్యకరమైన వీడియోలు, స్క్రీన్‌ షాట్లను పోస్ట్‌ చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కకుండా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ ఐడీని, జీమెయిల్‌ ఐడీలను తొలగించేవాడు. మానసికంగా వేదనకు గురైన బాధితురాలి భర్త రాచకొండ సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి మంగళవారం నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి, జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. సెల్‌ఫోన్, సిమ్‌కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 
చదవండి: నీటి ట్యాంకు శుభ్రం చేయబోయి.. పైపులో జారిపడ్డ కార్మికుడు

మరిన్ని వార్తలు