దొంగతనం.. ఆపై కొంత దూరం వెళ్లి దుస్తులు మార్చి..

26 Jun, 2021 09:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పోలీసులకు చిక్కకుండా స్నాచర్ల ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు స్నాచర్లు తాము చేసిన నేరానికి సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా కొత్త ఎత్తు వేశారు. బంధువుల వాహనంపై స్నాచింగ్‌ చేయడానికి వెళ్తూ నంబర్‌ ప్లేట్, ‘పని’ పూర్తయిన తర్వాత తమ వ్రస్తాలు మార్చుకున్నారు. ఈ ద్వయాన్ని అరెస్టు చేసిన బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు 16.3 తులాల బంగారం స్వాదీనం చేసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. బొల్లారం, శామీర్‌పేట్‌ ప్రాంతాలకు చెందిన పి.సంతోష్‌, టి.కరుణాకర్‌ స్నేహితులు.

విలాసాలకు అలవాటుపడిన వీరు స్నాచింగ్స్‌కు పథకం వేశారు. సంతోష్‌ తన బంధువుల బైక్‌ తీసుకురాగా.. దాని నంబర్‌ ప్లేట్‌ మార్చి, తలో జత బట్టలు పట్టుకుని ఇద్దరూ స్నాచింగ్‌ చేయడానికి బయలుదేరే వారు. మహిళల మెడలోని గొలుసు తెంచుకెళ్లేవారు. ఆపై కొంత దూరం వెళ్లి తమ వ్రస్తాలను మార్చుకునేవారు. వీరు అల్వాల్, దుండిగల్, జగద్గిరిగుట్టలతో పాటు గౌరారంల్లో నాలుగు నేరాలు చేశారు. బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి: బిట్‌ కాయిన్స్‌ పేరుతో రూ.60 లక్షలు స్వాహా

మరిన్ని వార్తలు