అడ్డుకున్నారని.. సెక్యూరిటీపై ట్రాన్స్‌జెండర్ల దాడి

23 May, 2022 18:29 IST|Sakshi

సాక్షి,నిజాంపేట్‌(హైదరాబాద్): ట్రాన్స్‌జెండర్లు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి రాయల్‌ విలేజ్‌ ఈశ్వర్‌రావు అనే వ్యక్తి సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం 3.50 గంటల ప్రాంతంలో కొందరు ట్రాన్స్‌జెండర్లు రాయల్‌ విలేజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్‌రావు, మరో సెక్యూరిటీ సిబ్బంది దుర్గాసింగ్‌లు వారిని అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లు వారిని నెట్టుకుంటూ కొట్టి గాయపరిచారు. దీంతో బాధితులు తమకు ప్రాణహాని ఉందని, ట్రాన్స్‌జెండర్లు తమపై దాడి చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించాలని కోరుతూ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ప్రాణస్నేహితులు.. విధి ఆడిన ఆటలో ఆ నలుగురు..

మరిన్ని వార్తలు