Alwal: పగలంతా చిత్తు కాగితాలు ఏరుకుంటారు.. మధ్యలో వృత్తి మార్చి

28 Oct, 2021 12:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు మహిళల నుంచి రూ.10 లక్షలు స్వాధీనం

సాక్షి అల్వాల్‌: చిత్తు కాగితాలు ఏరుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అల్వాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుండి రూ. 10 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. సీఐ గంగాధర్‌ తెలిపిన మేరకు.. హస్మత్‌పేట్‌ అంజయ్యనగర్‌లో నివాసముండే సంతోష్‌కుమార్‌ ఇంట్లో ఈ నెల 14న చోరీ జరిగింది. రూ.18.50 లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా బుధవారం హస్మంత్‌పేట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో  దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడైంది.
చదవండి: దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

గుల్బర్గకు చెందిన జ్యోతి(30), రూప (36)లు తుకారగేట్‌లోని మంగర్‌ బస్తీలో నివాసముంటున్నారు. ఉదయం పూట చిత్తుపేపర్లు ఏరుకోవడం, వెంట్రుకలకు స్టీల్‌ సామగ్రి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. మధ్యలో దొంగతనానికి పాల్పడుతున్నారు. హస్మత్‌పేట్‌లో దొంగతనానికి పాల్పడిన డబ్బులో కొంత జల్సాలకు ఉపయోగించారు. వారి నుంచి  10 లక్షల 7 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు