ఆస్తి తగాదాలు.. సొంత అక్కను కిచెన్‌లోకి తీసుకెళ్లి..

2 Aug, 2021 13:44 IST|Sakshi

సాక్షి, గోల్కొండ( హైదరాబాద్‌): ఆస్తి తగాదాలతో సొంత అక్కను అంతమొందించిన నలుగురు సోదరులు, ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...టోలిచౌకి ఆడమ్స్‌ కాలనీకి చెందిన  రైసా బేగం హైకోర్టులో న్యాయవాది. ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా సోదరులు మహ్మద్‌ ఆరిఫ్‌ అలీ (38), మహ్మద్‌ రవూఫ్‌అలీ (40), మహ్మద్‌ఆసిఫ్‌ అలీ (37), మహ్మద్‌ అసన్‌ అలీ (36)తో  రైసా బేగంకు తండ్రి ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఈ నలుగురు మహ్మద్‌ ఆరిఫ్‌ అలీ భార్య సనీనా బేగం (37) తో కలిసి రైసా బేగంను హతమార్చి అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా మహ్మద్‌ ఆరిఫ్‌ అలీ గత నెల 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు రైసా బేగం వద్దకు వచ్చారు. ఆస్తుల విషయం పై ఇరువురిమధ్య వాగ్వాదం జరిగింది. కాగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ...మహ్మద్‌ ఆరిఫ్‌ అలీ సోదరి రైసా బేగంను కిచెన్‌ లోకి తీసుకెళ్లి కిందకపడుకోబెట్టి వంట కత్తితో గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గోల్కొండ అదనపు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ మట్టంరాజు నిందితులను శనివారం రాత్రి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు