నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం

10 Apr, 2021 14:39 IST|Sakshi

వనస్థలిపురం: నగరంలో ముగ్గురు బాలికలు అదృశ్యమవడం కలకలం రేపింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌లో ఉండే ముగ్గురు బాలికలు (17),(15),(14) ఏళ్లు తమ  తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.

శుక్రవారం రాత్రి ఓ విషయంలో వీరి తల్లి పెద్ద కుమార్తెను మందలించింది. దీంతో తల్లి, ముగ్గురు కుమార్తెల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, శనివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి ముగ్గురు కుమార్తెలు ఇంట్లో కనిపించలేదు. వారి ఆచూకీ కోసం ఆ పరిసరాల్లో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

( చదవండి: కొత్త ట్విస్ట్‌: వదినా..మరిది..కొడుకు.. ఓ క్రైం కథ )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు