అయ్యో జమీర్‌!

26 Dec, 2020 07:57 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఎంఐఎం నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఫారుఖ్‌ అహ్మద్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ జమీర్‌ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారంక్రితం ఆదిలాబాద్‌ తాటిగూడలో పిల్లల క్రికెట్‌ విషయమై గొడవ చెలరేగగా.. ఫారుఖ్‌ తుపాకీ, తల్వార్‌తో వీరంగం సృష్టించాడు. పాత కక్షలతో ప్రత్యర్థి వర్గానికి చెందిన సయ్యద్‌ మన్నన్‌పై తల్వార్‌తో దాడిచేశాడు. మోతేషాన్‌పై కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా అడ్డుగా వచ్చిన సయ్యద్‌ జమీర్‌పైనా కాల్పులకు దిగడంతో అతని శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో  తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్‌ దవాఖానకు తరలించారు. అయితే సయ్యద్‌ జమీర్‌ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో  అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జమీర్‌ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక కాల్పుల ఘటన అనంతరం ఫారుఖ్‌ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది. 
(చదవండి: ఆదిలాబాద్‌ ఎంఐఎం శాఖ రద్దు)

క్రికెట్‌ పంచాయితీ ప్రాణం తీసింది
జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్‌ అహ్మద్‌ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్‌ మన్నన్‌ కుమారుడు మోతిషీమ్‌ శుక్రవారం సాయంత్రం క్రికెట్‌ ఆడే క్రమంలో గొడవపడ్డారు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్‌కాగా ఫారూఖ్‌ అహ్మద్‌ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్‌ మన్నన్‌ బంధువు టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్‌ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్, తల్వార్‌తో దాడికి దిగాడు. సయ్యద్‌ మన్నన్‌పై తల్వార్‌తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరపగా సయ్యద్‌ మన్నన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్‌ జమీర్, మోతిషీమ్‌లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి.
(చదవండి: చిచ్చురేపిన క్రికెట్‌.. కాల్పుల కలకలం)

మరిన్ని వార్తలు