ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం

28 Aug, 2021 06:57 IST|Sakshi
అరెస్టయిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వసంతి (ఫైల్‌)

దారికాచి రూ.10 లక్షల దోపిడీ నిందితురాలిని అరెస్టు చేయకపోవడంపై హైకోర్టు జడ్జి ఆగ్రహం 

తమిళనాడులో ఇటీవల దారికాచి రూ.10 లక్షలు దోపిడీ చేసిన కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులే దారి దోపిడీకి పాల్పడితే ప్రజల గతేమిటి. అరెస్ట్‌ చేయకుండా కాలయాపన చేస్తుంటే ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఎట్టకేలకు మహిళా ఇన్‌స్పెక్టర్‌ వసంతిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.   

సాక్షి ప్రతినిధి, చెన్నై: శివగంగై జిల్లా ఇళయాన్‌గుడికి చెందిన బేకరీ వ్యాపారి అర్షిత్‌ (32) సరుకులు కొనుగోలు కోసం రూ.10 లక్షలు తీసుకుని జూలై 5న మదురై–తేని రోడ్డు సమీపంలోకి వచ్చాడు. అదే సమయంలో నాగమలై పుదుకోట్టై పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వసంతి.. పాల్‌పాండి, పాండియరాజన్, ఉక్కిరపాండి, సీమైస్వామిని వెంట బెట్టుకుని అక్కడి చేరుకున్నారు. తనిఖీల పేరు తో అర్షిత్‌ వద్దనున్న రూ.10 లక్షలు లాక్కుని బెదిరించి పంపేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన మదురై జిల్లా క్రైం బ్రాంచ్‌ పోలీసు లు విచారణ చేపట్టారు. ఇన్‌స్పెక్టర్‌ వసంతి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో డీజీపీ ఆమెను సస్పెండ్‌ చేశా రు.చదవండి:బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్స్‌ తప్పనిసరి..మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు..

సంఘటన జరిగిన రోజు వసంతితోపాటు ఉన్న తేనికి చెందిన పాల్‌ పాండిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.61 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉక్కిరపాండి, సీమైస్వామి అరెస్ట్‌ చేసి రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ వసంతి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు నాలుగు రోజుల క్రితం విచారణకు వచ్చింది.

పోలీసుల తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగి నెలరోజులైనా ఇన్‌స్పెక్టర్‌ వసంతిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. ఇలాంటి ఉదాసీన పోకడల వల్లే పోలీసులంటే ప్రజల్లో విలువ తగ్గి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించి కేసు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నీలగిరి జిల్లా కొత్తేరిలో ఉన్న వసంతిని, ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. చదవండి: 20 ఏళ్ల క్రితం ఇంటికి తాళం.. దెయ్యాలు ఉంటాయని పూజలు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు