చిన్నారుల మృతి కేసు: దర్యాప్తు ముమ్మరం

17 Sep, 2020 16:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోజ్‌ బిస్కెట్లు తిని పిల్లలు మృతి చెందిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌ రోజ్‌ బిస్కెట్ల తయారీ కంపెనీలో ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బిస్కెట్లకు సంబంధించిన శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. బిస్కెట్లు తయారీ యూనిట్‌ని అధికారులు సీజ్‌ చేశారు. బిస్కెట్లు తిని పిల్లలు అస్వస్థతకు గురికావడం అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బిస్కెట్లను మార్కెట్‌ నుంచి వెనక్కి రప్పిస్తున్నామన్నారు.బిస్కెట్లలో లోపం ఎలా జరిగిందో అర్థం కావట్లేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే విషయాలు బయటపడతాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: బిస్కెట్లా?.. విష ప్రయోగమా?)

‘బిస్కెట్‌’ ఘటనలో మూడో చిన్నారి మృతి..
కర్నూలు జిల్లా ఆళ్ల గడ్డ మండలం చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఈ నెల 13న బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురైన మూడో చిన్నారి కూడా మృత్యువాత పడింది. ఘటన జరిగిన రోజు హుస్సేన్‌బాషా(6),తర్వాతి రోజు హుస్సేన్‌బీ(4) అనే ఇద్దరు మృతి చెందగా, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడో బాలిక జమాల్‌బీ(8) బుధవారం మరణించింది.

మరిన్ని వార్తలు