ఏపీ: వెలుగులోకి నకిలీ చలానాల వ్యవహారం

13 Aug, 2021 08:22 IST|Sakshi

17 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రూ.5.40 కోట్ల నకిలీ చలానాలు 

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు