ఏసీబీ వలలో ఇరిగేషన్‌ డీఈ

28 Nov, 2020 04:35 IST|Sakshi
పట్టుబడిన రూ.2లక్షల నగదుతో డీఈ మోహన్‌గాంధీ

సీబీఆర్‌ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించడం కోసం లంచం తీసుకుంటూ దొరికిన డీఈ  

రూ.3 కోట్ల వరకు అక్రమాస్తులు  

డీఈ ఇల్లు, ఫాంహౌస్‌తో పాటు పులివెందులలో ఏసీబీ తనిఖీలు

అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్‌ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెలలో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(సీబీఆర్‌) ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. అందులో భాగంగా ముదిగుబ్బ మండలం రాఘవపల్లిలో కంచం లీలావతికి చెందిన ఇంటికి ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ. 21 లక్షలు మంజూరు చేసింది. ఈ క్రమంలో పార్నపల్లి సబ్‌ డివిజన్‌ డీఈ మోహన్‌గాందీ(సీబీఆర్‌) లీలావతిని రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని కోరాడు. లీలావతి ఖాతాలో నష్టపరిహారం జమ కాగానే.. లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఈ నెల 25న ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ డీఎస్పీ, అనంతపురం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ అల్లాబ„Š  బృందం.. శుక్రవారం ఉదయం రెడ్‌హ్యాండెడ్‌గా డీఈని పట్టుకున్నారు. 

విలాసవంతమైన భవనం 
పార్నపల్లి సబ్‌ డివిజన్‌ డీఈగా పని చేస్తున్న మోహన్‌గాంధీ ఇల్లు ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఇంట్లోనే స్విమ్మింగ్‌ పూల్, బార్, జిమ్, హోం థియేటర్‌ ఉన్నాయి. ఆ ఇంటి ధర రూ.3 కోట్ల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఈ ఇల్లు, ఫాంహౌస్‌తో పాటు పులివెందులలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు.  

>
మరిన్ని వార్తలు