భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి

1 Oct, 2021 07:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫోన్లో తరచూ మాట్లాడి టార్చర్‌..  

సాక్షి, చెన్నై: నెర్కుండ్రంలో భార్యపై కోపంతో నాలుగు బైకులకు, ఓ కారుకు నిప్పు పెట్టి దగ్ధం చేసిన ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నెర్కుండ్రం షణ్ముఖనగర్‌ సత్యం వీధిలో గత నెల 25న ఒక కారు, నాలుగు బైకులు నిప్పు అంటుకుని దగ్ధమయ్యాయి. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్‌ (26)ను పోలీసులు అరెస్టు చేశారు.

చదవండి: (ఆరేళ్లుగా సహజీవనం: టాలీవుడ్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య)

పోలీసులు వివరణలో చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పని చేస్తున్న సతీష్‌ 2019 నుంచి భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటి నుంచి తల్లి ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య అతనికి తరచూ ఫోన్‌ చేసి వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విరక్తి చెంది.. భార్య వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ మంటలు విస్తరించి సమీపంలోని కారు, నాలుగు బైకులు దగ్ధం చేశాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ విష యం స్థానికంగా సంచలనం కలిగించింది. 

చదవండి: (లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు