బాబాయ్‌ చేతిపై టాటూ.. తల్లి పేరే అని అనుమానంతో!

30 Jul, 2021 17:31 IST|Sakshi
నిందితులు రాజ్‌ అగర్వాల్‌, ప్రకాష్‌

జైపూర్‌: తల్లి పేరును అంకుల్‌ చేతిపై చేసిన 20 ఏళ్ల కుర్రాడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. శశి అగర్వాల్‌ అనే వ్యక్తి రాజ్‌ అగర్వాల్‌ తండ్రితో అండమాన్‌లోని పోర్ట్‌ బ్లయిర్‌లో వ్యాపారం చేస్తుంటాడు. ఈ సాన్నిహిత్యంతో శశి తరుచూ జైపూర్‌లోని రాజ్‌ ఇంటికి వస్తుంటాడు. ఎప్పటిలాగే కొన్ని రోజుల క్రితం భంక్రోటా ప్రాంతంలో ఉంటున్న రాజ్‌ అగర్వాల్‌ వద్దకు వచ్చాడు వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం సాయత్రం బాబాయ్‌తో కలిసి రాజ్‌, అతని స్నేహితులు మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ పూర్తిగా మద్యం మత్తులోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో బాబాయ్‌ చేతిపైన రాజ్‌కు ఓ టాటూ కనిపిండింది. అది కొన్ని ఇంగ్లీష్‌ అక్షరాలతో ఉండి తన సవతి తల్లి పేరులాగా ఉండంటంతో రాజ్‌ అశ్చర్యపోయాడు.

వెంటనే ఏంటి విషయం అని బాబాయ్‌ను నిలదీశారు. అనంతరం టాటూ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న శశి, రాజ్‌ అసభ్యంగా ట్లాడుకున్నారు.దీంతో తన తల్లికి, బాబాయ్‌కి అక్రమ సంబంధం ఉందేమో అని రాజ్‌కు అనుమానం కలగడంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్ తీసుకొని బాబాయ్ తల పగలగొట్టాడు. అక్కడితో ఆగకుండా ఒక తీగను బాబాయ్ మెడ చుట్టూ బిగించి చంపేశాడు. ఆ రాత్రి తన స్నేహితుడు ప్రకాష్‌తో కలిసి ఒక కారు అద్దెకు తీసుకున్నాడు.  శశి శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి, చుట్టూ ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా కారులో ఆ శవాన్ని పెట్టుకొని సాయంత్రం వరకూ తిరిగారు.

ఆ తర్వాత ఊరు చివరకు వెళ్లి అర్థరాత్రి  గొయ్యి తవ్వి దానిలో శవాన్ని పూడ్చిపెట్టారు. వీళ్లు చేస్తున్న పనిని చూసిన కొందరు గొర్రెలకాపరులు చూడటంతో వెంటనే గ్రామస్తులను వెంటపెట్టుకొని వచ్చారు.  రాజ్, తన స్నేహితుడు ప్రకాష్‌ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుమానం తీరకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ యువకులు చేసిన ఘాతుకం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.
 

మరిన్ని వార్తలు