పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్‌

24 Apr, 2022 21:07 IST|Sakshi

న్యూఢిల్లీ: హర్యానాకి చెందిన ఒకవ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో మతపరమైన ద్వేషపూరిత రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్‌ చేయడంతో పెద్ద వివాదానికి తెరలేపింది. అతను 2020లో హర్యానాలో జామియా మిలియా యూనివర్సిటీ సమీపంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కాల్పులు జరిపిన షూటర్‌గా గుర్తించారు. అతను తనను తాను రాంభక్త్ గోపాల్‌గా చెప్పుకునే యువకుడు. 

పటౌడీలో జరిగిన 'మహాపంచాయత్'లో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మతపరమైన ప్రసంగాల చేయడంతో అరెస్‌ అయిన వ్యక్తి. గతేడాదే అతనికి హర్యానా కోర్టు బెయిల్‌ మంజరూ చేసింది. గోపాల్‌ తన ఇన్‌స్టాగ్రాంలో ఎస్‌యూవీ కారులో వస్తూ.. తుపాకితో పిలల్లను బెదిరిస్తున్న వీడియోతోపాటు మరో వ్యక్తిని కొడుతున్న వీడియోని కూడా పోస్ట్‌ చేశాడు. పైగా ప్రతి వీడియోలో "గో రక్షా దళ్‌, మేవాత్‌ రోడ్‌ హర్యానా" అని రాసి ఉంది. దీంతో ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌ అవుతున్న ఈ రెండు వీడియోలపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వ్యక్తి తన ఇన్‌స్టాగ్రాంని ప్రైవేట్‌గా మార్చుకున్నాడు.

అంతేకాదు గోపాల్‌ తనను తాను గాడ్సే 2.0గా అభివర్ణించుకుంటూ...ఆయుధాలతో రెచ్చగొట్టే వీడియోలు, ఫోటోలు పెట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్‌ చేయడంతో ట్విట్టర్‌లో ఈ మతపరమైన రెచ్చేగొట్టే వీడియోలు పోస్ట్‌ చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరలు అవుతున్నాయి.

(చదవండి: ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చిన లోకల్‌ ట్రైన్‌.. ప్రయాణికుల పరుగులు)

మరిన్ని వార్తలు