ఇంట్లోనే ఐపీఎస్ అధికారి దారుణ హత్య.. పనిమనిషి పరార్‌

4 Oct, 2022 13:20 IST|Sakshi

జమ్ముకశ్మీర్‌ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన ఇంట్లో శమమై కన్పించారు. నిందితుడు ఆయనను ఊపిరాడకుండా చేసి, ఆ తర్వాత పగిలిన గ్లాస్‌ సీసా ముక్కతో గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు శవానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు.

అయితే హేమంత్ లోహియా హత్య జరిగిన వెంటనే ఆయన ఇంట్లో పనిచేసే యాసిర్‌ పరార్ అయ్యాడు. హత్య జరిగిన కాసేపటికే ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు సీసీటీవీలో రికార్డులో అయింది. పోలీసులు రంగంలోకి దిగి గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లోహియా ఇంట్లో యాసిర్‌ ఆరు నెలలుగా పని చేస్తున్నాడని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. అతనికి ఆవేశం ఎక్కువని, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు. యాసిర్‌ను విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన లోహియా(57) జమ్ముకశ్మీర్ జైళ్ల డీజీగా పనిచేస్తున్నారు. జమ్ము పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆయన హత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు.
చదవండి: మోదీజీ వారిపై చర్యలు తీసుకోండి.. లేఖ రాసి సాధువు ఆత్మహత్యాయత్నం!

మరిన్ని వార్తలు