విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం..

15 Oct, 2022 18:36 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్‌ కార్లపై దాడులకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు. జనసేన కార్యకర్తల తీరుతో ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గర్జన సభ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి.

జనసేన కార్యకర్తలు తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనలో తమవారికి గాయాలయ్యాయని జోగి రమేశ్ పేర్కొన్నారు. తన కారు అద్దాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో తమపై దాడులు చేయించారని ధ్వజమెత్తారు. మాతో పెట్టుకుంటే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు.


చదవండి: జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’

మరిన్ని వార్తలు