తాడిపత్రిలో ‘పచ్చ’ ప్రలోభాలు 

26 Feb, 2021 07:55 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రికెట్‌ కిట్లు

 క్రికెట్‌ కిట్ల పంపిణీకి యత్నం

మున్సిపల్ ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందేందుకు టీడీపీ ప్లాన్‌

జేసీ సోదరుల అనుచరుని పెంట్‌హౌస్‌లో పెద్ద ఎత్తున డంప్‌

స్వాధీనం చేసుకున్న పోలీసులు  

తాడిపత్రి(అనంతపురం): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో యువతను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ నాయకులు ముమ్మర యత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే క్రికెట్‌ కిట్లు పంపిణీ చేసేందుకు సిద్దపడ్డారు. ఇందులో భాగంగా స్థానిక జూనియర్‌ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో, జేసీ సోదరుల అనుచరుడి పెంట్‌హౌస్‌లో పెద్ద ఎత్తున క్రికెట్‌ కిట్లను గురువారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  జేసీ, స్పర్శ పేరుతో ముద్రించి కిట్లను సిద్ధం చేయించారు.

ముందస్తు సమాచారంతో  పట్టణ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐలు రామకృష్ణ, ప్రదీప్‌కుమార్, మహిళా ఎస్‌ఐ లక్ష్మి, సిబ్బంది బృందావనం అపార్ట్‌మెంటు పైభాగంలో గురువారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అప్పటికే పంపిణీ చేయగా మిగిలిన క్రికెట్‌ కిట్లను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కిట్లు ఉంచిన గదికి తాళం తీసేందుకు పోలీసులు రెండు గంటలకుపై శ్రమించాల్సి వచ్చింది. రాత్రి 8 గంటలకు పెంట్‌హౌస్‌కు చేరుకున్న పోలీసులు అతి కష్టంపై 11 గంటల సమయంలో గది తాళాలను తెరవగలిగారు.
చదవండి:
బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! 
నాకు సీఎం పదవి అవసరమా?: చంద్రబాబు 

మరిన్ని వార్తలు