జేఈఈ పేపర్‌ లీక్‌ కేసు: రష్యన్‌ వ్యక్తి అరెస్టు

3 Oct, 2022 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) పేపర్‌ లీక్‌ కేసులో రష్యన్‌ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సెంట్రల్‌ బ్యూర్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. సదరు రష్యన్‌ వ్యక్తిని మిఖాయిల్‌ షార్గిన్‌గా అధికారులు గుర్తించారు. నిందితుడు జేఈఈ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ఐలియన్‌ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌ చేయడంలో సహకరించినట్లు సీబీఐ పేర్కొంది.

మిఖాయిల్‌ కజికిస్తాన్‌లోని అల్మాటీ నుంచి భారత్‌కు వచ్చేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడంతో ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాదు జేఈఈ మెయిన్స్‌తో సహా వివిధ ఆన్‌లైన్‌ పరీక్షల్లో కొందరు విదేశీయులు  కుమ్మక్కై హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది.

ఈ మేరకు సీబీఐ మాట్లాడుతూ... జేఈఈ మెయిన్స్‌ 2021 పరీక్షను నిర్వహించే ఐలియన్‌ సాఫ్ట్‌వేర్‌ను మిఖాయిల్‌ షార్గిన్‌ హ్యాక్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) రూపొందించింది. పరీక్ష సమయంలో అనుమానిత అభ్యర్థుల కంప్యూటర్‌ సిస్టమ్‌ను హ్యాక్‌ చేయండలో ఈ నిందితులు సహకరించినట్లు తేలింది. దీంతో అతనికి నోటీసులు జారి చేసినట్లు పేర్కొంది. 

(చదవండి: విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్‌ స్టాప్‌గా ప్రయాణించిన విమానం)

మరిన్ని వార్తలు