కలకలం: బీజేపీ నాయకుడి కుమార్తెపై అత్యాచారం, హత్య?

9 Jun, 2021 22:09 IST|Sakshi

అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడిన బాలిక

అత్యాచారంతోపాటు హత్య చేసి ఉంటారని అనుమానం

రాంచీ: అటవీ ప్రాంతంలో బీజేపీ నాయకుడి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. రెండు రోజులుగా కనిపించికుండాపోయిన కుమార్తె విగతజీవిగా మారడంతో ఆ నాయకుడు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పలాం జిల్లాలోని బుదాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడికు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె (16) పదో తరగతి చదువుతోంది. జూన్‌ 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె మళ్లీ ఇంటికి రాలేదు. కంగారుపడిన కుటుంబసభ్యులు తెలిసినవారి ఇళ్లల్లో, స్నేహితుల నివాసాల్లో గాలించారు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో పాంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే లాలిమతి అటవీ ప్రాంతంలో బుధవారం (జూన్‌ 9) చెట్టుకు వేలాడుతూ ఓ మృతదేహం కనిపించింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించగా బీజేపీ నాయకుడి కుమార్తెగా గుర్తించారు. అయితే బాలిక మృతదేహంపై గాయాలు, దుస్తులు చెదిరి ఉండడం, కళ్లు బయటకు వచ్చి ఉండడంతో ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విచారణ చేపట్టగా ప్రదీప్‌కుమార్‌ సింగ్‌ ధనుక్‌ (23)తో బాలికకు సంబంధం గుర్తించి అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు వివాహితుడు. 

బాలికపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలికను హత్య చేశారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. ఎందుకంటే బాలిక మృతదేహం చూడలేని పరిస్థితిలో ఉంది. కేసును దర్యాప్తు చేసి నిజానిజాలు త్వరలోనే తేలుస్తామని పోలీసులు తెలిపారు.

చదవండి: ఇంజెక‌్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు