జార్ఖండ్ జడ్జి హత్య కేసు విచారణ: రూ.5 లక్షల రివార్డు ప్రకటించిన సీబీఐ

15 Aug, 2021 16:21 IST|Sakshi

రాంచీ:  సంచలనంగా మారిన జార్ఖండ్‌ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ కేసు విచారణను వేగవంతం చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హత్య కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారన్ని అందించిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటించారు. హత్య, కుట్ర వివరాలు ఎవరికైనా తెలిస్తే.. ఆ సమాచారాన్ని తెలియజేసిన వారికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని సీబీఐ పేర్కొంది.

గత నెల 28న ఉదయం 5గంటల సమయంలో రోడ్డు పక్కన జాగింగ్‌ చేస్తున్న జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను ఓ టెంపో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాపు చేసి.. ఆ టెంపో వాహనాన్ని నడిపిన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుమోటో తీసుకున్న సూప్రీం కోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు