పుట్టింటికి వెళ్లాలన్న భార్య.. కోపంతో ముక్కు కోసేసిన భర్త

11 Sep, 2021 21:18 IST|Sakshi

జైపూర్‌: భార్య పుట్టింటికి వెళ్లాలని అడిగింది. భర్త ఇప్పుడు కాదన్నాడు. అయినా వినలేదని ఆ వ్యక్తి తన భార్య ముక్కు కోసేశాడు. గృహ హింసకు సంబంధించిన ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్‌, పూనమ్ దేవి భార్యాభ‌ర్త‌లు. ఇటీవ‌ల పూన‌మ్ దేవి తన త‌ల్లిదండ్రుల‌కు ఆరోగ్యం బాగోలేదని ఓ సారి పుట్టింటికి వెళ్లి వ‌స్తాన‌ని భర్త‌ను కోరింది.

కానీ ఆమె భర్త ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత వెళ్లమని వీలైతే అప్పుడు తాను కూడా వస్తానని చెప్పాడు. అయితే ఈ క్రమంలో శుక్ర‌వారం మ‌రోసారి పుట్టింటికి వెళ్లాలని అడగగా అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో క్ష‌ణికావేశంలో భూమా క‌త్తితో పూన‌మ్ దేవి ముక్కు కోసేశాడు. దీంతో ఆమె బిగ్గరగా అరవడంతో ఇరుగుపొరుగు వారు మహిళను ఆస్పత్రికి తరలించారు.

ప్రథమ చికిత్స అందించిన తర్వాత పూనమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం వారు ఈ విషయాన్ని తన సోదరుడికి కూడా తెలియజేశారు. పూనమ్ సోదరుడు తన బావమరిది భూమ రామ్‌పై పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ని నమ్మి 300 కి.మీ వెళితే అఘాయిత్యం.. అశ్లీల వీడియోలు తీసి..


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు