పేకాటపై వార్తలు, జర్నలిస్టుపై దాడి

18 Nov, 2020 10:48 IST|Sakshi

దిస్‌పూర్‌: రాష్ట్రంలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని వార్తలు రాసిన ఓ జర్నలిస్టుపై జూదగాళ్లు మూకుమ్మడి దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. ఈ సంఘటన గువాహటికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాలో జరిగింది. ప్రముఖ అస్సామీ దినపత్రిక ప్రతీదిన్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కరుప్ జిల్లాకు చెందిన మిలన్ మహంత అనే జర్నలిస్ట్‌ గ్రామీణ ప్రాంతాల్లో పేకాటపై వరుస కథనాలు రాశారు. దీంతో కక్ష్య పెంచుకున్న ఐదుగురు జూదగాళ్లు రిపోర్టర్‌పై ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. జర్నలిస్టు మిలన్‌ మహంత్‌ మెడ, తల, చెవుల మీద గాయాలవగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై బారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని మిగతావాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు