జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటన.. టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు..

12 Jun, 2022 11:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఘటన జరిగి 15 రోజులు కావొస్తున్నా.. నిత్యం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార కేసులోని ఆరుగురు నిందితులను పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులోని A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడి నేటీతో ముగియనుంది. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్‌ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మొత్తం ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. 

జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదివారం అయిదుగురు మైనర్లతో పాటు సాదుద్దీన్‌ను విచారించనున్నారు. పోలీసులు శనివారం నిందితులందరికి ఉస్మానియాలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్‌  హోంకు, సాదుద్దీన్‌ మాలిక్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఇక ఈ కేసులో బాధితురాలి మెడికల్‌ రిపోర్టు కీలకంగా మారనుంది. ఈ మెడికల్‌ రిపోర్టు ప్రకారం లైంగిక దాడి సమయంలో మైనర్‌ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ సమయంలో మైనర్‌ లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమె మెడపై కొరకడం వంటి దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్‌ శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టాటూలా ఉండాలనే మెడపై కొరికినట్లు నిందితుల వాగ్మాలం ఇచ్చారు. బాలిక ప్రతిఘటించడంతో గాయాలైనట్లు ఒప్పుకున్నారు.
చదవండి: మైండ్‌ బ్లోయింగ్‌: అమ్నేషియా పబ్‌ కేసులో మరో ట్విస్ట్‌

మరిన్ని వార్తలు