‘కేవలం శారీరక సుఖం కోసమే ఇన్నాళ్లు తిరిగా, పెళ్లి కోసం కాదు’

8 Sep, 2021 10:45 IST|Sakshi
నిందితుడు కొండబాబు

యువతిని మోసగించిన వ్యక్తిపై కేసు

సాక్షి, బంజారాహిల్స్‌: పెళ్లై పిల్లలున్న విషయాన్ని దాచి పెట్టి తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించిన యువకుడు తనతో పాటు పని చేస్తున్న యువతిని మోసగించిన ఘటనలో బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌­లో­ని అపోలో ఆస్పత్రి మెయిన్‌ ఓపీ ఫార్మసీలో జూనియర్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కొండబాబు ఓ యువతితో 2018 మార్చిలో పరిచయం ఏర్ప­డింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించిన కొండబాబు ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. 2020 జూలైలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఫార్చున్‌ వల్లభ హోట­ల్‌కు తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛలు తీర్చుకున్నాడు.

అయితే కొద్ది రోజుల తర్వాత కొండబాబుకు పెళ్లై పిల్లలు కూడా ఉన్న విషయాన్ని బాధితురాలు తెలుసుకొని నిలదీసింది. తన భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ మరోసారి వంచించడమే కాకుండా పలుమార్లు అదే హోటల్‌లో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ఈ నెల 6వ తేదీన బాధిత యువతి పెళ్లి మాట ఎత్తేసరికి కులం పేరు ఎత్తాడు. తాను కేవలం శారీరక వాంఛల కోసమే ఇన్నాళ్లు తిరిగానని, పెళ్లి కోసం కాదన్నాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయా­నని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా కొండబాబుపై ఐపీసీ సెక్షన్‌ 376(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: వీడిన మిస్టరీ: నీటి కుంటలో శవమై తేలిన జయశీల్‌రెడ్డి
80 ఏళ్ల వృద్ధుడి హత్య: ‘రూ.10 వేలు ఇస్తా.. నీ భార్యను పంపు’

మరిన్ని వార్తలు