కారుకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చి మరీ ప్రేమ వేధింపులు

24 Mar, 2021 10:52 IST|Sakshi

ప్రేమించాలంటూ జూబ్లీహిల్స్‌లో వైద్యురాలికి వేదింపులు

సాక్షి, జూబ్లీహిల్స్‌: ప్రేమించాలంటూ వివాహిత వైద్యురాలిని వేదిస్తున్న ఓ వ్యక్తి.. ఆమె ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఇదెలా సాధ్యమయ్యిందో వైద్యురాలికి అంతు పట్టలేదు. చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి వైద్యురాలు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తుందో తెలుసుకునేదుకు ఏకంగా ఆమె కారుకు జీసీఎస్‌ ట్రాకర్‌ను అమర్చినట్లు వెల్లడించాడు. ఆ వివరాలు.. బాధితురాలు జూబ్లీహిల్స్‌లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్‌ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ వైద్యురాలిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా విశ్వనాథ్‌ తన తీరు మార్చుకోలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో వైద్యురాలు దీని గురించి తన భర్తకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యురాలి భర్త విశ్వనాథ్‌ని హెచ్చరించడం కోసం అతడి ఇంటికి వెళ్లాడు.

విశ్వనాథ్‌ ఇంట్లో అతడితో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. తమను హెచ్చరించడానికి వచ్చిన వైద్యురాలి భర్తపై విశ్వనాథ్‌, అతడి స్నేహితుడు శ్రీకాంత్‌ గౌడ్‌ ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో వైద్యురాలు, ఆమె భర్త విశ్వనాథ్‌ మీద జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో సంచలన విషయాలు తెలిసాయి. వైద్యురాలిని వెంటాడేందుకు విశ్వనాథ్‌ ఆమె కారుకు జీపీఎస్‌ ట్రాకర్‌ని అమర్చినట్లు వెల్లడించాడు. 

చదవండి: ‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు