అత్యాచార నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు 

12 Jun, 2022 01:08 IST|Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ లైంగికదాడి ఘటనలోని నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు శనివారం ఉదయం సైదాబాద్‌ జువెనైల్‌ హోం నుంచి ఐదుగురు మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ కేసులోని ఆరుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుకస్టడీలో ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మూడు ప్రైవేట్‌ కార్లలో మైనర్లను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్‌లు వేసి ఒక్కొక్కరిని ఫోరెన్సిక్‌ విభాగానికి తరలించారు. వీరందరికి డాక్టర్‌ సుధాకర్‌ నేతృత్వంలో రెండుగంటలపాటు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐదుగురు మైనర్లను జువెనైల్‌  హోంకు, సాదుద్దీన్‌ మాలిక్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, సైదాబాద్‌ జువెనైల్‌  హోంలో ఉన్న నిందితులను మొదటిరోజైన శుక్రవారం ఉత్తర్వు కాపీలు ఆలస్యంగా అందటంతో పోలీసులు కస్టడీకి తీసుకోలేకపోయారు.   

మరిన్ని వార్తలు