Jubilee Hills:వాష్‌రూమ్‌లో స్పై కెమెరా: వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు

23 Sep, 2021 12:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌ వాష్‌రూమ్‌లో మొబైల్‌ అమర్చిన కేసులో నిందితుడైన మైనర్ బాలుడిని జువెనైల్‌ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఫుడ్ కోర్టు సీసీ ఫుటేజీని మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చైతన్య ఇంటిలో సోదాలు జరుపుతున్నారు. విచారణలో మైనర్ బాలుడు బెనర్జీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని, అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు . అయితే  ఈ కేసులో కేశవ్ పాత్రపై ఇంకా పోలీసులకు క్లారిటీ రాలేదు.

కాగా వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌ వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ ప్లేస్‌లో మొబైల్‌ అమర్చిన ఈనెల 22వ తేదిన ఓ యువతి ఫిర్యాదు చేసిందని జూబ్లీహిల్స్ ఎస్‌ఐ నవీన్ రెడ్డి తెలిపారు. నిందితుడు మైనర్ బాలుడు అరు నెలలుగా ఈ హోటల్లో పని చేస్తున్నడని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే.  ఫుడ్​కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్​రూమ్​కు వెళ్లింది. అక్కడి బాత్‌రూమ్‌లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
చదవండి: జూబ్లీహిల్స్‌: ఫుడ్‌కోర్ట్‌ టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ పెట్టి.. వీడియోలు రికార్డింగ్‌

పర్సనల్ పని కోసం యువతి బాత్ రూం వెళ్ళినప్పుడు సీక్రెట్ ప్లేస్‌లో యువతి స్పై కెమెరా గమనించిందన్నారు. వెంటనే మేనేజ్‌మెంట్‌ దృష్టికి ఆ తర్వాత పోలీసుల దృష్టికి తీసుకు వచ్చిందని చెప్పారు. మైనర్ బాలుడు వారం రోజుల క్రితమే ఆ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడని, వాష్ రూమ్‌లో వీడియో చిత్రీకరించే సమయంలో ఫోన్‌లో సిమ్ కార్డ్ లేదని వెల్లడించారు. 14 వేలకు ఫోన్ కొన్నాడని, తన ఫోన్ నుంచి ఎవరికీ ఆ వీడియోలు పంపినట్లు తాము కనుగొనలేదని వెల్లడించారు.
(చదవండి: ఓయో రూమ్‌కు వస్తే ఉద్యోగం ఇస్తా..)

నిందితుడిది సైకో మనస్తత్వం
హోటల్ యజమాని చైతన్యను పీఎస్‌కు పిలిపించి విచారించాము. హోటల్‌లో ఉన్న అక్కడి సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నాం. తమ ఫుటేజ్ ఉందా అని పోలీస్ స్టేషన్‌కు ఎవరూ రాలేదు. కేశవ్ వ్యక్తి అక్కడ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు. అతని ప్రమేయం ఏముందో తెలియాలి. కేశవ్ అనే వ్యక్తి గురుంచి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. నిందితుడిది సైకో మనస్తత్వం. మానసిక స్థితి సరిగాలేదు. కేసులో ప్రమేయం వున్న వారందరిని విచారిస్తాం. ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మైనర్ బాలునిపై ఐపీసీ 354, 506 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హోటల్ పై కేసు నమోదు చేశాం’ అని పోలీసులు తెలిపారు. 

స్పై కెమెరా పెట్టింది అతనే
కాగా తమ హోటల్‌లో స్పై కెమెరా పెట్టింది హౌజ్‌ కీపింగ్‌ బాయ్‌ బెనర్జీనే అని, అతడికి యాజమాన్యం సహకరించింది లేదని వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టు యజమాని చైతన్య తెలిపారు. ఈ వ్యవహారంపై ఫుడ్‌ కోర్టు యజమాని చైతన్య స్పందించాడు. చైతన్య మాట్లాడుతూ.. ‘‘మా హోటల్‌లో స్పై కెమెరా పెట్టింది హౌజ్‌ కీపింగ్‌ బాయ్‌ బెనర్జీనే. అతనికి హోటల్ యాజమన్యం సహకరించింది లేదు. నిందితుడు ఫోన్ కొని నాలుగు రోజులే అవుతుంది. ఫోన్ వాష్ రూంలో పెట్టిన రోజే గుర్తించారు. ఆరు నెలల నుంచి ఫోన్ పెట్టలేదు. ఆ వార్తలు అవాస్తవం. పోలీసులకు నేను సహకరిస్తున్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అని కోరాడు. 

మరిన్ని వార్తలు