వివాహిత మిస్సింగ్‌.. కారణం ఆ ఇద్దరేనా?

19 Aug, 2022 14:49 IST|Sakshi

తాళ్లరేవు(కాకినాడ జిల్లా): వారం రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయిన వివాహిత మంథా సాయి శ్రీజ ఆచూకీ కోసం కోరంగి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కోరంగి ఎస్సై టి.శివకుమార్‌ కథనం ప్రకారం.. నీలపల్లికి చెందిన శ్రీజ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తల మధ్య స్పర్థలు రావడంతో కాకినాడ దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీజకు వెంకీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తదనంతరం సాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారితో కూడా శ్రీజకు కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయి.
చదవండి: వివాహేతర సంబంధం.. రోజూ కలవడం కుదరదని.. ప్రియురాలి భర్తకు..

ఈ నేపథ్యంలో వారి వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి ఆమె అదృశ్యమైంది. తనకు వైజాగ్‌లోని ఒక కళాపరిషత్‌లో ఉద్యోగం వచ్చిందని, కొంత కాలం తరువాత తిరిగి వస్తానని చెప్పిన తమ కుమార్తె.. బ్యాగ్, కొంత నగదు తీసుకుని వెళ్లిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

అయితే సూసైడ్‌ నోట్‌ ఆధారంగా యానాం, కోరంగి వద్ద గోదావరిలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఇద్దరి యువకుల కారణంగా తమ కుమార్తె జీవితం నాశనమైందని శ్రీజ తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి వేధింపుల వల్లే సూసైడ్‌ నోట్‌ రాసి, కనిపించకుండా పోయిందని ఆరోపించారు. వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు